పైసా వసూల్.. పాపడ్!
మజారే అప్పడాలు.. పులిహోర దప్పళాలు...వివాహభోజనంబు.. ఆహాహా.. అంటూ సాంగే అందుకున్నాడు ఘటోత్కచుడు.. అప్పడం ఈజ్ ఈక్వల్ టూ విందుభోజనం అంటారు నేటి భోజనప్రియులు.. కరకర.. గరగరా అని పంటి కింద పాపడం నలిగినప్పుడు ఉండే మజా మాటలకందనిది! ఆంధ్రాలో అప్పడమైనా..
తెలంగాణలో పాపడ్‌గా మారినా.. కంచం నిండా రకరకాల్లో అది లేకపోతే లోటే అనిపిస్తుంది!అప్పడం ఒక్కటి ఉంటే.. అది మామూలు ప్లేట్ మీల్ అయినా.. కడుపు నిండా భోంచేసిన తృప్తి కలుగుతుంది. అదంతా పాపడం మహాత్మ్యమేమో! ప్రపంచం నిండా 100కు పైగా పాపడాల రకాలున్నాయి.. వాటిని ఇంట్లో ఆడుతూ, పాడుతూ చేసుకొని.. చిరు వ్యాపారంగా మార్చుకునే మార్గాన్ని చూపిస్తున్నాం..
వేడి వేడి అన్నంలో కాస్త పప్పు, పక్కన పాపడ్ ఉంటే ఆ టేస్టే వేరప్పా. పప్పుచారు అంచుకు, పులుసులోకి నంజుకు తినడానికి ఒకే ఒక పాపడ్ ఉంటే చాలు. మరేవి ఉండనీ, ఉండకపోనీ అప్పడం లేని భోజనం, భోజనంలా తోచదు చాలామందికి! హోటల్లో ప్లేట్, ఫుల్ మీల్స్ ఏది ఆర్డరిచ్చినా.. దాంతో పాటు పాపడ్ కంపల్సరీ! ఎవరైనా అతిథులు ఇంటికొస్తే.. కక్కాముక్కా ఏర్పాటు చేస్తారు. అదే ఏదైనా ఉపవాసమున్న రోజు వస్తే ముందు వేగేవి అప్పడాలే! నిజంగా అప్పడాలు చేయడం ఒక ఆర్టే. మునుపు చాలామంది ఇళ్లల్లోనే అప్పడాలు, వడియాలు చేస్తుండేవారట. వాటిని బయట అణాకానీలకు అమ్ముకొని సొమ్ముచేసుకునేవారట. కూర, పచ్చడి లేకపోయినా.. అప్పడాలుంటే అన్నం లాగించేయొచ్చంటే ఏమంటారు? కాదనలేరు!. పాపడ్‌లో వేయించుకునేవి కొన్ని ఉంటే, కాల్చుకు తినే అప్పడాలు కూడా ఉన్నాయి. మినప, పెసర, కారం, మసాలా, క్యారెట్.. ఒక్కటేమిటి వందల రకాలు ఇప్పుడు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. ప్రస్తుతం అయ్యప్ప దీక్షలు నడుస్తున్నాయి. అందులో అయ్యప్ప పాపడాలని.. సగ్గు బియ్యంతో చేసిన పాపడ్‌లని వేస్తారు. ఇంకో విషయం.. అప్పడం మలబద్ధకాన్ని పోగొడుతుందట. అసలు భోజనంలో అదరువుగానే కాదు.. పాపడ్ ఓ టిఫిన్‌గానో, కాలక్షేపపు చిరుతిండిగానో కూడా మా గొప్పగా ఉంటుదనేది అప్పడ సత్యం. వంటకు వంకలెన్నో పెట్టేవాళ్లకు.. తిండి రందీ తెప్పించాలంటే తిరుగులేని ఆయుధం కూడా పాపడమే. అందుకే దాన్ని ఆధారంగా చేసుకొని చిరువ్యాపారంలో సక్సెస్ సాధిస్తున్న మానసి కథ చదవండి.
మానసి పుట్టింది మహారాష్ట్రలోని మార్వాడీ కుటుంబంలో. ఇంటర్ అయిపోగానే పెళ్లి చేశారు. భర్త చేయి పట్టుకొని హైదరాబాద్ చేరుకుంది. అప్పటికే వారికి పాపడ్‌ల తయారీ పరిశ్రమ ఉంది. దాన్ని మానసి అత్తగారు నడిపిస్తుండేవారు. రెండేళ్ల వరకు ఆ పరిశ్రమ గురించి కానీ, అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం గానీ మానసి చేయలేదు. ఎందుకంటే.. అందరూ బయటకు వెళ్లిపోతే.. ఇంటి పనంతా చేసుకొని ఇంట్లోనే రోజు గడిచిపోయేది. ఒకరోజు అత్త చెప్పిన మాటలు ఆమె ఆలోచన మార్చేశాయి. అంతకుముందు మానసి అత్తగారి కుటుంబానికి వేరే బిజినెస్ ఉండేదట. అది లాస్ కావడంతో.. అందరూ ఇంట్లోనే ఉండేవాళ్లు. మామూలుగా మార్వాడీ కుటుంబాల్లో బయట నుంచి ఏదీ కొనుక్కు రావడానికి ఇష్టపడరు. అందుకే పాపడ్‌లను ఇంట్లోనే తయారుచేసేవాళ్లు. అది చూసిన మానసి భర్తకు ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఆ తయారుచేసిన పాపడ్‌లను.. పక్కనే పడి ఉన్న చీరల కవర్‌లో నీట్‌గా సర్దాడు. మలక్‌పేట్ గంజ్‌లోని ఆర్.కె. అగర్వాల్ అనే ఆయన దగ్గరకు వెళ్లాడు. ఆయన వాటిని టేస్ట్ చేసి ఇంకా కావాలని ఆర్డరిచ్చాడు. దాంతో వాళ్లత్తమ్మ మరికొంత మందిని జమ చేసి పాపడ్‌లు చేయడం మొదలెట్టారు. మొదట్లో చేస్తూ.. తర్వాత మెషనరీల గురించి కొడుకు తెలుసుకున్నాడు. అలా ఒక కొత్త యూనిట్ ప్రారంభమైంది. ఈ కథంతా మానసిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అంత వయసున్న అత్తమ్మే చలాకీగా చేస్తుంటే, తాను చేయాలేనా? అని పాపడ్ యూనిట్‌కి వచ్చింది మానసి.
మార్వాడీల ఇళ్లలో చిరుతిళ్లు చేస్తుంటారు. అది ఇంట్లో వరకు ఓకే. కానీ మార్కెట్‌లోకి తీసుకొచ్చినప్పుడు టేస్ట్ బాగుంటేనే ఆదరిస్తారు. ఒకే టైప్ అయినా బోర్ కొడుతుంది. అప్పటిదాకా అత్తమ్మ 2, 3 వెరైటీలను మాత్రమే చేసేది. ఆగిపోకూడదనుకుంది మానసి. అందుకే దాదాపు 20 వెరైటీలకు పెంచింది. గార్లిక్, ఆలూ, రాగి, మిక్స్‌డ్ వెజిటేబుల్.. అంటూ పలురకాల పాపడ్‌లను మార్కెట్‌కి పరిచయం చేసింది. ఎన్నో ఎగ్జిబిషన్లలో పాల్గొంది. మామూలుగా ఉన్న కంపెనీని లాభాల బాట పట్టించింది. జనరల్‌గా పాపడాలను చేస్తున్నప్పుడు విరిగిపోతాయి. వాటిని ఏం చేయలేం. వాటిని కూడా లూజ్ రూపంలో అమ్మేసి సొమ్ము చేసుకుంటోంది. ఈ లాభాల వెనక నాలుగు సంవత్సరాల కృషి ఉంది.
మార్వాడీలో బియ్యం అప్పడాలను కిచ్చా అంటారు. ఎనిమిది సంవత్సరాలుగా ఈ తయారీలో పనిచేస్తున్నా. నాలుగు సంవత్సరాల కింద పూర్తిగా ఈ కంపెనీ నా హ్యాండ్‌లోకి వచ్చింది. నేను ఇంటరే చదివా. అయినా నా కింద నలుగురు పనిచేస్తున్నారంటే గర్వంగా ఉంది. ఇతురల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మా ఆయనకు నేను గవర్నమెంట్ జాబ్ చేయాలని ఉండేది. కానీ నా కిందే నలుగురు పనిచేస్తున్నప్పుడు ఉద్యోగమెందుకనిపించింది. అందుకే పై చదువుల గురించి కూడా ఆలోచించలేదు. పాపడాలను తయారు చేయడం అంత ఈజీ కాదు. శ్రద్ధగా చేస్తే ఒక్కరోజులోనే నేర్చుకోవచ్చు. లేకపోతే టేస్ట్, క్వాలిటీ మిస్సవుతాం. అందుకే జాగ్రత్తగా చేయాలి. హాయిగా పిల్లలు వెళ్లిన తర్వాత ఆడుతూ, పాడుతూ ఈ పని చేసుకోవచ్చు. 18 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్నవాళ్లు ఎవరైనా దీంట్లోకి అడుగుపెట్టొచ్చు. హార్డ్‌వర్క్ చేసేవాళ్లకు ఇది మంచి ఉపాధి! కేవలం నాలుగు గంటలు కష్టపడితే చాలు. నా ఈ కృషికి మా ఆయన సహకారం మరచిపోలేనిది.
పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించింది మానసి. కొత్తలో అత్తగారు ఏం చేస్తే వెనకాలే ఆ పని సర్దుకుంటూ వచ్చేది. ముందు మినప పప్పు, పెసరపప్పు పాపడాలను తయారుచేసేవాళ్లు. పప్పుల ధరలు ఆకాశాన్నంటాయి. ఆ సందర్భంలో ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతున్నదని కొడుకుకు అర్థమైంది. అల్టార్‌నేటివ్ ఏంటని ఆలోచించారు. మానసి కాస్త రీసెర్చ్ చేసింది. బియ్యపు అప్పడాలు, సగ్గు బియ్యం అప్పడాల హవా ఉంది అప్పటికే మార్కెట్‌లో. వాటికి దీటుగానే ఈ యూనిట్‌ని రన్ చేయాలనుకుంది. అదే విషయం అత్తగారితో, భర్తకి చెప్పడంతో సరేనన్నారు. అప్పటికే ఈ పాపడ్‌లను ప్రగతి పాపడ్‌గా తీసుకొచ్చారు. దానికి తోడు అప్పటికీ ఎన్‌ఆర్‌డీఐ నుంచి కూడా సబ్సిడీ దొరుకుతుందని తెలిసింది. అలా స్టేట్ గవర్నమెంట్ సహాయంతో సరికొత్త యూనిట్‌ని ప్రారంభించారు. కొత్తగా ఉండాలని దీనిని సురక్ష పాపడ్ పేరుతో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
పాపడాల తయారీ చాలా ఈజీ. కాకపోతే టేస్ట్‌ను బట్టే మీ బ్రాండ్‌నేమ్ ఉంటుంది. ఇక్కడ ఫొటోలో పెద్ద మెషీనరీతో చేసే విధానం చూపిస్తున్నాం. చిన్న మెషనరీలో వేయడానికి పిండి చేతితోనే కలపొచ్చు.
ముందు పిండి కలపడానికి ఒక మెషనరీ ఉంటుంది. అందులో పిండి, ఉప్పు, తగినన్ని నీళ్లుపోసి మెషీన్ ఆన్ చేయాలి. ఆ తర్వాత పెద్ద గరిటెతో ముద్దలు కట్టకుండా కలపాలి. ఇలా చేసుకున్న దాన్ని బేసిన్‌లోకి తీసుకోవాలి.
పిండి కలపక ముందే పెద్ద గిన్నె నిండా నీళ్లు పోసుకొని మరిగించాలి. పైన బట్ట కప్పి.. లోపలకి పోకుండా గట్టిగా కట్టాలి. ఈ ఆవిరి మీద పిండిని చిన్న ముద్దలుగా చేసి పెట్టి 20 నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
ఉడికించిన పిండిని గిన్నెలోకి ఎత్తి.. ముందు పిండి కలిపిన మెషీన్‌లో మళ్లీ వేయాలి. మళ్లీ మెషీన్ ఆన్ చేసి పిండి మొత్తం ఉండలు లేకుండా జాగ్రత్త కలపాలి. పాపడాలు చేయడానికి పిండి కాస్త వేడిగా ఉంటేనే వస్తాయి.
రోలింగ్ మెషీన్‌కి కాస్త నూనె రాసి ఆన్ చేసుకోవాలి. పిండిని మెషీన్‌లో పెడితే.. ఆటోమెటిక్‌గా అప్పడాలు వచ్చి పడుతుంటాయి. మధ్యలో చుట్టూ ఉండే పిండి మిగులుతుంది. దాన్ని కూడా మళ్లీ ముద్దలా చేసి అప్పడాలు చేయొచ్చు.
ఇలా తయారైన అప్పడాలను ఒక రోజు ఇంట్లోనే ఆరబెట్టాలి. చేసిన రోజు అస్సలు ఎండలో పెట్టకూడదు. అలా చేస్తే పాపడాలు వంకర్లు తిరుగుతాయి. రెండో రోజు కాసేపు ఎండలో పెట్టి ప్యాకింగ్ చేసుకోవాలి.
పాపడాలు తయారుచేయడానికి పెద్ద మెషీన్ వాడితే మనకు రెండు గదుల ఇల్లు అవసరం. అలా కాకుండా చిన్న మెషీన్ అయితే ఉన్న ఇంట్లోనే పెట్టుకొని తయారుచేయవచ్చు. దాంతో ఇంటి అద్దె అవసరం ఉండదు.
పాపడాల తయారీ యంత్రం - రూ. 20, 000
వేయింగ్ మెషీన్ - 3, 000
సీలింగ్ మెషీన్ - 2, 000
ప్రాథమిక + ప్రారంభ వ్యయాలు - రూ. 10, 000
మొత్తం - రూ. 35,000
ఈ మెషీన్‌తో రోజుకు 15 కేజీల పాపడాలను తయారు చేయవచ్చు. అంటే నెలకి 25 రోజులు పనిదినాలనుకుంటే.. 375 కేజీల అప్పడాలను తయారుచేయొచ్చు. వీటిలో కూడా రకాలు ఉంటాయి. ఈ లెక్కలు సాదా పాపడాల చేయడానికి ఒక కేజీకి 30 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే.. 15 కేజీలకు మనకు 450 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే నెలకి.. 25x 450 = రూ. 11, 250
కరెంట్ - 300
లేబర్ ఖర్చు - 2,000
మొత్తం - 13, 550
పరిశ్రమ పెట్టుబడి = 48, 550
ఈ పరిశ్రమ వంద శాతం అమ్మకాలు జరిపితే..
ఒక ఏడాది ఆదాయం ఎలా ఉంటుందో చూద్దాం.
-నెలకి 25 పని రోజులు అనుకుంటే.. ఏడాదికి మూడొందల రోజులు అవుతుంది. అంటే సంవత్సరానికి ఎన్ని కేజీల పాపడాలను చేయొచ్చంటే..
300 x 15 = 4, 500
-పాపడాల్లో కూడా చాలా రకాలుంటాయి. జీరా, కారం, పుదీనా.. ఇలా ఫ్లేవర్లతో పాపడాలను తయారుచేసుకోవచ్చు. వాటికి ఎక్స్‌ట్రా ఖర్చు అవుతుంది. మామూలు పాపడాలకయితే 8 రూపాయలు ఖర్చు అవుతుంది.
4, 500 X 40 = 1, 80, 000
-పాపడాలను ఒక కేజీ 100 రూపాయలకు అమ్మాలి. రిటైలర్స్ దాన్ని 200లకు అమ్ముకుంటారు. మనం డైరెక్ట్‌గా అయితే 150కి అమ్మవచ్చు.
4, 500 X 100 = 4, 50, 000
నెలవారీ ఉత్పాదక వ్యయాన్ని ఏడాదికి లెక్కకడితే..
రూ. 13, 550 X 12 = 1, 62, 600
పరికరాల తరుగుదల 15శాతం అనుకుంటే..
రూ. 25, 000 X 15 % = 3, 750
ప్రారంభ ఖర్చులు = 10, 000
మొత్తం ఏడాది అయ్యే ఖర్చు = 1, 76, 350
-ఏడాది మొత్తం వచ్చిన ఆదాయం రూ. 4, 50, 000
-సంవత్సరం మొత్తంలో అయిన ఖర్చు రూ.1, 76, 350 తీసేస్తే లాభం రూ. 2, 73, 650 లు వస్తుంది.
-అంటే వందశాతం అమ్మకాలు జరిగితే నెలకు ఎంత లేదన్నా రూ. 22, 800 సంపాదించొచ్చు.
-ఇది కేవలం రోజుకు నాలుగు గంటలు మాత్రమే చేస్తే వచ్చే ఆదాయం. మీరు ప్రొడక్షన్ పెంచుకొని ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.
మనీ మ్యాటర్స్

అత్త వారసత్వంగా..

టేస్ట్ అదుర్స్..

శ్రద్ధగా చేస్తేనే..

కొత్త కొత్తగా..
పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించింది మానసి. కొత్తలో అత్తగారు ఏం చేస్తే వెనకాలే ఆ పని సర్దుకుంటూ వచ్చేది. ముందు మినప పప్పు, పెసరపప్పు పాపడాలను తయారుచేసేవాళ్లు. పప్పుల ధరలు ఆకాశాన్నంటాయి. ఆ సందర్భంలో ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతున్నదని కొడుకుకు అర్థమైంది. అల్టార్‌నేటివ్ ఏంటని ఆలోచించారు. మానసి కాస్త రీసెర్చ్ చేసింది. బియ్యపు అప్పడాలు, సగ్గు బియ్యం అప్పడాల హవా ఉంది అప్పటికే మార్కెట్‌లో. వాటికి దీటుగానే ఈ యూనిట్‌ని రన్ చేయాలనుకుంది. అదే విషయం అత్తగారితో, భర్తకి చెప్పడంతో సరేనన్నారు. అప్పటికే ఈ పాపడ్‌లను ప్రగతి పాపడ్‌గా తీసుకొచ్చారు. దానికి తోడు అప్పటికీ ఎన్‌ఆర్‌డీఐ నుంచి కూడా సబ్సిడీ దొరుకుతుందని తెలిసింది. అలా స్టేట్ గవర్నమెంట్ సహాయంతో సరికొత్త యూనిట్‌ని ప్రారంభించారు. కొత్తగా ఉండాలని దీనిని సురక్ష పాపడ్ పేరుతో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
పాపడాల తయారీ
పాపడాల తయారీ చాలా ఈజీ. కాకపోతే టేస్ట్‌ను బట్టే మీ బ్రాండ్‌నేమ్ ఉంటుంది. ఇక్కడ ఫొటోలో పెద్ద మెషీనరీతో చేసే విధానం చూపిస్తున్నాం. చిన్న మెషనరీలో వేయడానికి పిండి చేతితోనే కలపొచ్చు.
స్టెప్ 1
ముందు పిండి కలపడానికి ఒక మెషనరీ ఉంటుంది. అందులో పిండి, ఉప్పు, తగినన్ని నీళ్లుపోసి మెషీన్ ఆన్ చేయాలి. ఆ తర్వాత పెద్ద గరిటెతో ముద్దలు కట్టకుండా కలపాలి. ఇలా చేసుకున్న దాన్ని బేసిన్‌లోకి తీసుకోవాలి.
స్టెప్ 2
పిండి కలపక ముందే పెద్ద గిన్నె నిండా నీళ్లు పోసుకొని మరిగించాలి. పైన బట్ట కప్పి.. లోపలకి పోకుండా గట్టిగా కట్టాలి. ఈ ఆవిరి మీద పిండిని చిన్న ముద్దలుగా చేసి పెట్టి 20 నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
స్టెప్ 3
ఉడికించిన పిండిని గిన్నెలోకి ఎత్తి.. ముందు పిండి కలిపిన మెషీన్‌లో మళ్లీ వేయాలి. మళ్లీ మెషీన్ ఆన్ చేసి పిండి మొత్తం ఉండలు లేకుండా జాగ్రత్త కలపాలి. పాపడాలు చేయడానికి పిండి కాస్త వేడిగా ఉంటేనే వస్తాయి.
స్టెప్ 4
రోలింగ్ మెషీన్‌కి కాస్త నూనె రాసి ఆన్ చేసుకోవాలి. పిండిని మెషీన్‌లో పెడితే.. ఆటోమెటిక్‌గా అప్పడాలు వచ్చి పడుతుంటాయి. మధ్యలో చుట్టూ ఉండే పిండి మిగులుతుంది. దాన్ని కూడా మళ్లీ ముద్దలా చేసి అప్పడాలు చేయొచ్చు.
స్టెప్ 5
ఇలా తయారైన అప్పడాలను ఒక రోజు ఇంట్లోనే ఆరబెట్టాలి. చేసిన రోజు అస్సలు ఎండలో పెట్టకూడదు. అలా చేస్తే పాపడాలు వంకర్లు తిరుగుతాయి. రెండో రోజు కాసేపు ఎండలో పెట్టి ప్యాకింగ్ చేసుకోవాలి.
స్థిర వ్యయాలు
పాపడాలు తయారుచేయడానికి పెద్ద మెషీన్ వాడితే మనకు రెండు గదుల ఇల్లు అవసరం. అలా కాకుండా చిన్న మెషీన్ అయితే ఉన్న ఇంట్లోనే పెట్టుకొని తయారుచేయవచ్చు. దాంతో ఇంటి అద్దె అవసరం ఉండదు.
పాపడాల తయారీ యంత్రం - రూ. 20, 000
వేయింగ్ మెషీన్ - 3, 000
సీలింగ్ మెషీన్ - 2, 000
ప్రాథమిక + ప్రారంభ వ్యయాలు - రూ. 10, 000
మొత్తం - రూ. 35,000
నెలవారీ ఖర్చు
ఈ మెషీన్‌తో రోజుకు 15 కేజీల పాపడాలను తయారు చేయవచ్చు. అంటే నెలకి 25 రోజులు పనిదినాలనుకుంటే.. 375 కేజీల అప్పడాలను తయారుచేయొచ్చు. వీటిలో కూడా రకాలు ఉంటాయి. ఈ లెక్కలు సాదా పాపడాల చేయడానికి ఒక కేజీకి 30 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే.. 15 కేజీలకు మనకు 450 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే నెలకి.. 25x 450 = రూ. 11, 250
కరెంట్ - 300
లేబర్ ఖర్చు - 2,000
మొత్తం - 13, 550
పరిశ్రమ పెట్టుబడి = 48, 550
ఏడాది అమ్మితే వచ్చేది..
ఈ పరిశ్రమ వంద శాతం అమ్మకాలు జరిపితే..
ఒక ఏడాది ఆదాయం ఎలా ఉంటుందో చూద్దాం.
-నెలకి 25 పని రోజులు అనుకుంటే.. ఏడాదికి మూడొందల రోజులు అవుతుంది. అంటే సంవత్సరానికి ఎన్ని కేజీల పాపడాలను చేయొచ్చంటే..
300 x 15 = 4, 500
-పాపడాల్లో కూడా చాలా రకాలుంటాయి. జీరా, కారం, పుదీనా.. ఇలా ఫ్లేవర్లతో పాపడాలను తయారుచేసుకోవచ్చు. వాటికి ఎక్స్‌ట్రా ఖర్చు అవుతుంది. మామూలు పాపడాలకయితే 8 రూపాయలు ఖర్చు అవుతుంది.
4, 500 X 40 = 1, 80, 000
-పాపడాలను ఒక కేజీ 100 రూపాయలకు అమ్మాలి. రిటైలర్స్ దాన్ని 200లకు అమ్ముకుంటారు. మనం డైరెక్ట్‌గా అయితే 150కి అమ్మవచ్చు.
4, 500 X 100 = 4, 50, 000
సంవత్సర ఖర్చు విషయానికొస్తే..
నెలవారీ ఉత్పాదక వ్యయాన్ని ఏడాదికి లెక్కకడితే..
రూ. 13, 550 X 12 = 1, 62, 600
పరికరాల తరుగుదల 15శాతం అనుకుంటే..
రూ. 25, 000 X 15 % = 3, 750
ప్రారంభ ఖర్చులు = 10, 000
మొత్తం ఏడాది అయ్యే ఖర్చు = 1, 76, 350
లాభం అంచనా..
-ఏడాది మొత్తం వచ్చిన ఆదాయం రూ. 4, 50, 000
-సంవత్సరం మొత్తంలో అయిన ఖర్చు రూ.1, 76, 350 తీసేస్తే లాభం రూ. 2, 73, 650 లు వస్తుంది.
-అంటే వందశాతం అమ్మకాలు జరిగితే నెలకు ఎంత లేదన్నా రూ. 22, 800 సంపాదించొచ్చు.
-ఇది కేవలం రోజుకు నాలుగు గంటలు మాత్రమే చేస్తే వచ్చే ఆదాయం. మీరు ప్రొడక్షన్ పెంచుకొని ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.
No comments:
Post a Comment